Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిల్ రాజు నిర్మాతగా కొత్త హీరోతో 'పలుకే బంగారమాయే'

  • నిర్మాతగా వరుస సినిమాలు 
  • అన్నివర్గాల వారిని అలరించే ఆలోచన 
  • దసరా రోజున కొత్త సినిమా లాంచ్    
అభిరుచి కలిగిన నిర్మాతగా దిల్ రాజుకి మంచి పేరుంది. యూత్ కి .. మాస్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలాంటి కథలను అందించాలనే విషయంపై ఆయనకి మంచి అవగాహన వుంది. అందువల్లనే నిర్మాతగా ఆయన ఖాతాలో సక్సెస్ లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక వైపున 'శ్రీనివాస కల్యాణం' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోన్న ఆయన, త్వరలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

తన కజిన్ .. వ్యాపార భాగస్వామి అయిన శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఆయన ఒక సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకి 'పలుకే బంగారమాయే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'బొమ్మరిల్లు'లో .. అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు పరిచయం కానున్నట్టుగా సమాచారం. దసరా రోజున ఈ సినిమాను లాంచ్ చేసి .. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నట్టు తెలుస్తోంది.    
Dil Raju

More Telugu News